← Back to news

నిరంతర ఒత్తిడితో గుండెపై ప్రభావం.. జాగ్రత్త!

By A.Ajay· 8h ago
నిరంతర ఒత్తిడితో గుండెపై ప్రభావం.. జాగ్రత్త!

నిత్యం ఉండే మానసిక ఒత్తిడి మనసుకే కాదు.. గుండె ఆరోగ్యంపైనా ప్రభావం చూపొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి సమయంలో గుండె వేగంగా కొట్టుకోవడం, రక్తపోటు పెరగడం వంటి మార్పులు వస్తాయి. ఇది ఎక్కువ కాలం కొనసాగితే గుండె, రక్తనాళాలపై అదనపు భారం పడొచ్చు. పని ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు వంటి కారణాలతో స్ట్రెస్‌ పెరగకుండా జాగ్రత్తపడాలి. సరైన నిద్ర, వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, విశ్రాంతి తీసుకోవడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

More in Health