← Back to news

మీకు 'రొయ్య భంగిమ' వస్తోందా.. ఫోన్‌తో జాగ్రత్త!

By Krishna· 13h ago
మీకు 'రొయ్య భంగిమ' వస్తోందా.. ఫోన్‌తో జాగ్రత్త!

ఫోన్ వాడుతున్నప్పుడు మెడను వంచి కూర్చోవడం వల్ల ప్రమాదకర ‘ష్రింప్ పోస్చర్’ ఏర్పడుతుందని Surgical Technology International జర్నల్‌లో Kenneth స్టడీ తెలిపింది. సాధారణంగా తల బరువు 5 కేజీలు ఉంటే, 60 డిగ్రీలు వంచినప్పుడు అది 27 కేజీలకు పెరిగి, మెడపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. దీనివల్ల డిస్క్‌లు జారిపోయి నరాలపై ప్రెషర్, తిమ్మిర్లు, నొప్పి వస్తాయి. కాబట్టి ఫోన్‌ను కంటికి సమాన హైట్‌లో ఎత్తి పట్టుకోండి. అరగంటకోసారి మెడ ఎక్సర్‌సైజ్ చెయ్యండి. నిటారుగా కూర్చోండి.

More in Health