ఆరావళి పర్వతాలపై విత్తన బంతులు.. మహిళల కృషి!

రాజస్థాన్.. రాజ్‌సమంద్ జిల్లాలో పచ్చదనం పెంచేందుకు మహిళల బృందం కొత్త కార్యక్రమం చేపట్టింది. సంప్రదాయ వడిసెల వంటి పరికరాలతో ఆరావళి పర్వతాలపై విత్తన బంతులను విసురుతున్నారు. మొక్కలు నాటేందుకు వీలుకాని దట్టమైన ప్రాంతాల్లో కూడా విత్తనాలు చేరేలా కృషి చేస్తున్నారు. మట్టి, సేంద్రియ ఎరువులతో చేసిన ఈ విత్తన బంతులు.. వర్షాలకు నేలలో కలిసిపోయి మొలకెత్తుతాయి. 8 ఏళ్లుగా ఇలా చేస్తున్నారు. ఇప్పటివరకు 1లక్షా 50వేల విత్తన బంతులను వెదజల్లగా.. ఈ ఏడాది మరో 50 వేల బంతులు విసరాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.



