← Back to news

సోపతిగాళ్ల సంగతులన్నీ నిండిన కథలు

By Vishi· 17h ago
సోపతిగాళ్ల సంగతులన్నీ నిండిన కథలు

కరీంనగర్ జిల్లాలో గడిచిన రచయిత విశ్వరూప్ వేముల బాల్యాన్ని అచ్చంగా చెప్పే కథలివి. ‘దొర గారి బావి’, ‘చింతచెట్టు కింద గోలీలాట’, ‘కొత్త బ్యాటు కిరికెట్టు’, ‘ప్రోగ్రెస్ కార్డ్’, ‘ఊరు చివర సినిమా హాలు’.. ఇందులోని ప్రతి కథా తన స్నేహితులతో ముడివేసిందే. అందుకే దీనికి ‘సోపతిగాళ్లు’(స్నేహితులు) అని పేరు పెట్టారు. 1995-2005 మధ్య పుట్టినవాళ్లందరికీ ఇందులోని అనుభవాలు పరిచయమే. కథలకు తగ్గ అందమైన బొమ్మలు ఇందులో ఉన్నాయి. పుస్తకం వెల 180 రూపాయలు. కొనే <a href="https://amzn.in/d/0dvJiw3a">లింక్</a>.

More in Arts/Literature

బడుగు జీవుల గురించి చెప్పే బలమైన కథలు
Arts/Literature· 11h ago

బడుగు జీవుల గురించి చెప్పే బలమైన కథలు

సదానంద్ శారదగా ప్రసిద్ధులైన పాకాల సదానంద్‍ తెలంగాణలో పేరెన్నికగన్న కథకుడు. ‘జాడీ’ కథతో ప్రజాదరణ పొందిన ఆయన దాదాపు 150 కథల వరకు రాశారు. ఆయన కథలను ‘సదానంద్ శారద కథలు’ పేరిట నవచేతన ప్రచురణ సంస్థ కథాసంపుటిగా తీసుకొచ్చింది. ఆకలి, దారిద్ర్ర్యం, వెట్టిచాకిరీ, అవమానాలు, ఆత్మహత్యలతో ముగిసిన జీవితాల గురించి లోతైన తాత్వికత ఈ కథల్లో ఉంటుంది. బడుగు జీవులు బానిస సంకెళ్లను తెంచుకొని స్వేచ్ఛగా బతకడం ఆయన కథల్లో కనిపిస్తుంది. పుస్తకం ధర 180 రూపాయలు. కొనే <a href="https://newvishalandhrabooks.com/product/sadanand-sarada-kathalu-%E0%B0%B8%E0%B0%A6%E0%B0%BE%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%B6%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A6-%E0%B0%95%E0%B0%A5%E0%B0%B2%E0%B1%81/">లింక్</a>.