← Back to news

రెంటపాళ్లలో పెన్షన్ల పంపిణీ.. పాల్గొన్న MLA

By Siva· 53m ago· Rentapalla, Sattenapalli, Palnadu
రెంటపాళ్లలో పెన్షన్ల పంపిణీ.. పాల్గొన్న MLA

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పల్లెపండుగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో MLA కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో రూ.26 లక్షల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గోకులం షెడ్లను ప్రారంభించారు.

More in Local