← Back to news

Gen Alpha పిల్లల బాల్యం మారుతోంది!

By A.Ajay· 18h ago
Gen Alpha పిల్లల బాల్యం మారుతోంది!

మొబైల్ ఫోన్లు, ఆన్‌లైన్ గేమ్స్, వీడియోలు.. ఇవే నేటి పిల్లల జీవితంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. Gen Alphaగా పిలిచే ఈ తరం పిల్లల బాల్యంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. అయితే మొబైల్‌కే పరిమితం కాకుండా బయట ఆడుకోవడం, పుస్తకాలు చదవడం, మ్యూజిక్ నేర్చుకోవడం, స్నేహితులతో గడపడం కూడా అవసరం. చదువు, ట్యూషన్లతో పిల్లలపై ఒత్తిడి పెంచకుండా, వారికి నచ్చిన పనులు చేసుకునే సమయం ఇవ్వాలి. చదువు, ఆటలు, టెక్నాలజీ మధ్య సమతుల్యత ఉండేలా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.

More in Parenting