పేరెంట్స్.. పిల్లలకు ఇలా ఫుడ్ పెడితే.. అస్సలు వదలరు

ఒక్క ముద్ద తినిపించడానికి మొబైల్ చూపిస్తున్నారా? పిల్లల వెనకాల తిరుగుతూ, బలవంతంగా తినిపిస్తున్నారా? అయితే, ఈ అలవాట్లను మార్చాలని సూచిస్తున్నారు పీడియాట్రిషియన్ డాక్టర్ హర్ష వర్ధన్. భోజనం టైంలో పిల్లలను మొబైల్, టీవీకి దూరంగా ఉంచాలనీ. ఫోర్స్ చేయకుండా సొంతంగా తినేలా ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడం అలవాటు చేయాలని చెబుతున్నారు. మొదట్లో ఇబ్బందిగా అనిపించినా.. కొన్ని రోజులకు పిల్లలు ఫుడ్ తినేందుకు ఇష్టపడతారని చెబుతున్నారు.


