ఖానాపూర్‌లో గంజాయి పట్టివేత

నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ శివారులోని ఓ మిల్లులో పనిచేస్తున్న బిహార్‌కు చెందిన కార్మికుడి వద్ద గంజాయి ఉన్నట్లు సమాచారం రావడంతో రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. ఈ తనిఖీల్లో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తులో ఉందని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.



