← Back to news

ధూళిపాళ్లలో పట్టపగలే భారీ చోరీ

By Siva· 48m ago· Dhulipalla, Sattenapalli, Palnadu
ధూళిపాళ్లలో పట్టపగలే భారీ చోరీ

పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం ధూళిపాళ్ల గ్రామంలో పట్టపగలే దొంగతనం కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు బీరువా పగలగొట్టి సుమారు 40 సవర్ల బంగారు ఆభరణాలతో పాటు 6 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఇంటికి వచ్చిన బాధితుడు విగ్నేశ్వరరావు చోరీ జరిగినట్లు గుర్తించి సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు.

More in Local