← Back to news

భార్యపై దాడి చేసిన మాజీ ఎమ్మెల్యే

By Vishi· 1h ago

UPలోని దిబాయ్ మాజీ ఎమ్మెల్యే, సమాజ్‌వాది పార్టీ నాయకుడు గుడ్డు పండిత్(శ్రీభగవాన్ శర్మ) తన మూడో భార్య అర్చనా పండిత్‌పై దాడి చేసినట్లు కనిపిస్తున్న వీడియో బయటపడింది. వీడియోలో గుడ్డు పండిత్‌ ఒక మహిళను జుట్టు పట్టుకుని లాగుతూ నేలపై ఈడ్చుకుపోతున్న విజువల్స్ ఉన్నాయి. కాంగ్రెస్ మహిళా విభాగ నాయకురాలు అర్చనా పండిత్ శికార్‌పూర్ PCలో కంప్లైంట్ చేశారు. తను, తన కొడుకు పండిత్, అతని కుటుంబ సభ్యుల నుంచి చావు బెదిరింపులు ఎదుర్కొంటున్నామని చెప్పారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.