← Back to news

విజయవాడలో సరస్ మేళా

By A.Ajay· 4h ago
విజయవాడలో సరస్ మేళా

AP: దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులను ఒకే చోట చూసి కొనుగోలు చేసే అవకాశం విజయవాడలో రానుంది. పున్నమి ఘాట్‌లో అక్టోబర్ 13 నుంచి 31 వరకు జాతీయ సరస్ ఆజీవిక మేళా జరగనుంది. ఇందులో 576 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. చేనేత చీరలు, చేతితో చేసిన వస్తువులు, ఆహార పదార్థాలు, వివిధ ప్రాంతాల ప్రత్యేక వంటకాలు అందుబాటులో ఉంటాయి. మహిళా సంఘాలు తయారు చేసిన వస్తువులకు మార్కెట్ కల్పించడం, వారి ఆదాయం పెరగడానికి తోడ్పడటం ఈ మేళా ముఖ్య ఉద్దేశం.

More in AP