పుంగనూరు ఘటన.. MPపై కేసు

AP: ఆంధ్రప్రదేశ్లోని పుంగనూరు నామినేషన్ సెంటర్ దగ్గర నిన్న జరిగిన ఘర్షణకు సంబంధించి YSRCP MP మిథున్ రెడ్డిపై అన్నమయ్య జిల్లా పుంగనూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మొత్తం మూడు కేసులు నమోదు కాగా, సుమారు 70 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. డ్రోన్ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. త్వరలో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఈ ఘటనను ఎన్నికల సంఘం కూడా తీవ్రంగా పరిగణించింది.

