← Back to news

8 ఏళ్లలో Swiggyలో 53 లక్షల సంపాదన

By Lokesh· 1d ago· Youtube

Swiggyలో డెలివరీ పార్ట్‌నర్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఏడాదికి ఎంత సంపాదించగలరు? మహా అయితే రెండు లక్షలు.. ఓవర్‌టైం చేస్తే మూడు లక్షలదాకా! అయితే చెన్నైకి చెందిన శంకర్ 8 ఏళ్లుగా Swiggyలో పనిచేస్తూ మొత్తం 53 లక్షల రూపాయలు సంపాదించినట్లు Swiggy తెలిపింది. అంటే యావరేజ్‌గా ఏడాదికి 6.6 లక్షల వరకు, నెలకు 55 వేల వరకు సంపాదించారు. తనకు నచ్చిన సమయాల్లో పని చేసే అవకాశం ఉండటం వల్ల కుటుంబం, పిల్లల చదువును చూసుకుంటూనే ఈ ఆదాయం పొందగలిగినట్టు శంకర్ చెప్పారు. ఈ మొత్తం జస్ట్ సంపాదన మాత్రమే! ఖర్చులు విడిగా ఉన్నాయి.

More in Viral