గణేష్‌గడ్డలో బ్రహ్మోత్సవ సందడి.. పత్రిక ఆవిష్కరణ

TG: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలోని రుద్రారం గణేష్‌గడ్డ శ్రీ వినాయకస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల పత్రికను పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (జీఎంఆర్) ఆవిష్కరించారు. బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆలయ ఈవో లావణ్యను ఎమ్మెల్యే ఆదేశించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.



