← Back to news

డిగ్రీ కాలేజీలో ఓటర్ నమోదుపై అవగాహన

By B V Appalanaidu· 1h ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
డిగ్రీ కాలేజీలో ఓటర్ నమోదుపై అవగాహన

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటర్ నమోదుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా. సిహెచ్ కేశవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తహశీల్దార్ జి. రాజశ్రీధర్, డిప్యూటీ తహశీల్దార్ కె. మత్స్యరాజు, ఆర్.ఐ శంకర్రావు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతను ప్రిన్సిపల్ వివరించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. అనంతరం విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

More in Local