← Back to news

ప్రేమ పేరుతో వేధింపులు.. నిందితుడికి జైలు శిక్ష

By Sunke Vinith· 1h ago
ప్రేమ పేరుతో వేధింపులు.. నిందితుడికి జైలు శిక్ష

AP: కడప జిల్లా ప్రొద్దుటూరులో మహిళను ప్రేమ పేరుతో వేధిస్తూ, చంపేస్తానంటూ బెదిరించిన కేసులో నిందితుడు పళ్లపోతుల అనిల్ కుమార్ రెడ్డికి కోర్టు శిక్ష విధించింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి మహిళను వేధించిన కేసులో ప్రొద్దుటూరు కోర్టు నిందితుడికి మూడు ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5,500 జరిమానా విధించింది. ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు 83 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, పకడ్బందీ సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు. సాక్ష్యాల ఆధారంగా నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష ఖరారు చేసింది.

More in Local