← Back to news

అరకులోయ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలు ప్రారంభం

By B V Appalanaidu· 1h ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
అరకులోయ డిగ్రీ కాలేజీలో ప్రవేశాలు ప్రారంభం

AP: అల్లూరిసీతారామరాజు జిల్లా అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రథమ సంవత్సరం సింగిల్ మేజర్ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. అలాట్మెంట్ పొందిన విద్యార్థులు సెప్టెంబర్ 10లోగా కళాశాలలో చేరాలని ప్రిన్సిపల్ సీహెచ్ కేశవరావు సూచించారు. తొలి దశలో బీఏ పొలిటికల్ సైన్స్, బీకాం జనరల్, బీకాం సీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, బోటనీ, కెమిస్ట్రీ కోర్సుల్లో మొత్తం 319 సీట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాట్మెంట్ పొందిన విద్యార్థులు నిర్ణీత గడువులోగా ప్రవేశాలు పూర్తి చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు.

More in Local