← Back to news

UPI లావాదేవీలకు MDR.. ASSOCHAM చీఫ్ ఎకనామిస్ట్ ఏమన్నారంటే?

By Mahesh· 1h ago· PTI
UPI లావాదేవీలకు MDR.. ASSOCHAM చీఫ్ ఎకనామిస్ట్ ఏమన్నారంటే?

UPI దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇచ్చిందని <a href="https://x.com/PTI_News/status/2100165412248080466">ASSOCHAM చీఫ్ ఎకనామిస్ట్ SP శర్మ</a> అన్నారు. ఏటా 250 బిలియన్‌కు పైగా, నెలకు 20 బిలియన్‌కు మించిన UPI ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయని తెలిపారు. UPI మరింత సస్టైనబుల్‌గా ఉండేందుకు MDR తీసుకొచ్చినట్లు చెప్పారు. 2వేల రూపాయల దాటిన లావాదేవీలకే ఇది వర్తిస్తుందని, భారం వ్యాపారులపైనే ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. వ్యక్తి నుంచి వ్యక్తికి చేసే UPI చెల్లింపులు ఫ్రీగానే ఉంటాయని తెలిపారు. దీనిపై మీ కామెంట్స్ తెలపండి.

More in National

‘మోదీ భక్తుడి’కి దాదాసాహెబ్ ఫాల్కే..నెటిజన్ల కామెంట్స్
National· 16m ago

‘మోదీ భక్తుడి’కి దాదాసాహెబ్ ఫాల్కే..నెటిజన్ల కామెంట్స్

కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు ఇవాళ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. గతంలో తనను తాను బహిరంగంగా ‘మోదీ భక్తుడి’గా ఆయన ప్రకటించుకున్న విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2022 నవంబర్ 16న బెంగళూరులో కర్ణాటక మీడియా అకాడమీ నేషనల్ ప్రెస్ డే కార్యక్రమంలో ‘మన ప్రధాని ఎనిమిదిన్నర సంవత్సరాల్లో ఒక్క రోజు సెలవు తీసుకోకుండా పూర్తి నిబద్ధతతో పని చేశారు. నేను మోదీజీ భక్తుడినని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు’ అని ఆయన అన్నారు. ఆ భక్తే ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇప్పించిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.