← Back to news

పెట్రోల్ పంపుల్లో UPI ఛార్జీలు వద్దంటున్న డీలర్లు

By Mahesh· 1h ago· ANI
పెట్రోల్ పంపుల్లో UPI ఛార్జీలు వద్దంటున్న డీలర్లు

2వేల రూపాయల దాటిన UPI పేమెంట్స్‌పై MDR ఛార్జీలు విధించడంపై ఆల్ ఇండియా పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ (AIPDA) అభ్యంతరం తెలిపింది. ఈ ఛార్జీల నుంచి పెట్రోల్ డీలర్లకు ఎగ్జెంప్షన్ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరింది. లీటర్‌పై మార్జిన్ ఫిక్స్‌డ్‌గా ఉన్నందున ఎక్స్‌ట్రా ట్రాన్సాక్షన్ ఛార్జీలు డీలర్లపై భారం పెంచుతాయని తెలిపింది. క్రెడిట్, డెబిట్ కార్డు లేదా UPI ఏదైనా వాడినా డీలర్ మార్జిన్ పెరగదని లేఖలో పేర్కొంది.

పెట్రోల్ పంపుల్లో UPI ఛార్జీలు వద్దంటున్న డీలర్లు
పెట్రోల్ పంపుల్లో UPI ఛార్జీలు వద్దంటున్న డీలర్లు

More in National

‘మోదీ భక్తుడి’కి దాదాసాహెబ్ ఫాల్కే..నెటిజన్ల కామెంట్స్
National· 59m ago

‘మోదీ భక్తుడి’కి దాదాసాహెబ్ ఫాల్కే..నెటిజన్ల కామెంట్స్

కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు ఇవాళ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. గతంలో తనను తాను బహిరంగంగా ‘మోదీ భక్తుడి’గా ఆయన ప్రకటించుకున్న విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2022 నవంబర్ 16న బెంగళూరులో కర్ణాటక మీడియా అకాడమీ నేషనల్ ప్రెస్ డే కార్యక్రమంలో ‘మన ప్రధాని ఎనిమిదిన్నర సంవత్సరాల్లో ఒక్క రోజు సెలవు తీసుకోకుండా పూర్తి నిబద్ధతతో పని చేశారు. నేను మోదీజీ భక్తుడినని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు’ అని ఆయన అన్నారు. ఆ భక్తే ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇప్పించిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.