‘మోదీ భక్తుడి’కి దాదాసాహెబ్ ఫాల్కే..నెటిజన్ల కామెంట్స్

కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు ఇవాళ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు. గతంలో తనను తాను బహిరంగంగా ‘మోదీ భక్తుడి’గా ఆయన ప్రకటించుకున్న విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2022 నవంబర్ 16న బెంగళూరులో కర్ణాటక మీడియా అకాడమీ నేషనల్ ప్రెస్ డే కార్యక్రమంలో ‘మన ప్రధాని ఎనిమిదిన్నర సంవత్సరాల్లో ఒక్క రోజు సెలవు తీసుకోకుండా పూర్తి నిబద్ధతతో పని చేశారు. నేను మోదీజీ భక్తుడినని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచం లేదు’ అని ఆయన అన్నారు. ఆ భక్తే ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇప్పించిందని పలువురు కామెంట్ చేస్తున్నారు.



