← Back to news

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

By Bala· 44m ago
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ఖమ్మం జిల్లా చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More in Local