సీపీ సాయి చైతన్య మానవీయత.. వృద్ధాశ్రమంలో సేవ!

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఐపీఎస్ చింతకుంట ఉచిత వృద్ధాశ్రమంలో మానవీయ సేవా కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. స్వయంగా భోజనాలు వడ్డించారు. ఆశ్రమ నిర్వాహకుడు మోహన్, పోలీస్ సిబ్బందికి ప్రశంసలు. సమాజంలో వృద్ధుల పట్ల ఆదరణ పెరగాలని సీపీ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్ బాబు, రుద్రూర్ సీఐ కృష్ణ, వర్ని ఎస్ఐ వంశీ కృష్ణ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


