భగత్ సింగ్ కాలనీలో ధర్నా.. పట్టాల డిమాండ్!
నెల్లూరు సిటీ 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో CPI(M) ఆధ్వర్యంలో మహా ధర్నా జరిగింది. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంటి పన్నులో డోర్ నంబర్తో పాటు యజమాని పేరు చేర్చాలని డిమాండ్ చేశారు. డ్రైనేజీ అవుట్లెట్ ఏర్పాటు చేసి దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ఇళ్లకు, ఇళ్ల స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు కాకుండా శాశ్వత రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్నా నది రిపీట్ ప్రింట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.


