22A అంశంపై చర్చకు సిద్ధం: మంత్రి శ్రీధర్‌బాబు

TG: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తొలిరోజే 22A భూముల వివాదంపై బీజేపీ సభ్యులు ప్లకార్డులతో నిరసనకు దిగారు. భూదందాలపై సమగ్ర విచారణ జరిపించాలని సభ్యులు నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. BACలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ తెలపగా, దీనిపై మంత్రి శ్రీధర్‌బాబు స్పందించారు. 22A అంశంపై సభలో స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సభ సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని మంత్రి కోరారు.



