చీరలు లాగడం ప్రజాస్వామ్యమా? : KTR

మహిళల చీరలు లాగడం ప్రజాస్వామ్యమా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇవాళ ఉదయం అసెంబ్లీ సమావేశాలకు తాము వేసుకొచ్చిన టీ షర్టులపై అభ్యంతరకర పదాలు ఏమున్నాయి అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీని దుస్శాసన సభగా మార్చారన్న కేటీఆర్.. పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడికి నిరసనగా.. అస్లెంబీలో ప్రభుత్వాన్ని కచ్చితంగా నిలదీస్తామని కేటీఆర్ అన్నారు.



