← Back to news

బస్సులో రూ.3 లక్షలు.. కండక్టర్ నిజాయితీకి హ్యాట్సాఫ్!

By Mahesh· 3h ago· X· హైదరాబాద్‌

TG: హైదరాబాద్‌లో RTC కండక్టర్ సరిత తన నిజాయితీ చాటుకున్నారు. శనివారం షాద్‌నగర్‌కు చెందిన జహంగీర్ తన వైఫ్‌తో కలిసి హజ్‌కు వెళ్లేందుకు బయలుదేరారు. అఫ్జల్‌గంజ్‌లో బస్ దిగిన తర్వాత నాంపల్లికి వెళ్లగా, రూ.3 లక్షల క్యాష్ ఉన్న బ్యాగ్ బస్సులోనే మర్చిపోయారు. బ్యాగ్‌ను చూసిన కండక్టర్ సరిత వెంటనే డ్రైవర్ నరసింహులుకు చెప్పి డబ్బును సేఫ్‌గా ఉంచారు. దంపతులు తిరిగి రాగానే మొత్తం క్యాష్‌ను వారికి హ్యాండ్‌ఓవర్ చేశారు. కండక్టర్ సరిత, డ్రైవర్ నరసింహులు నిజాయితీని నెటిజన్స్ అప్రిషియేట్ చేస్తున్నారు.

More in TG