← Back to news

సోషల్ మీడియా పోస్టులపై కేంద్రం నిఘా

By AR· 10 Apr 2026· Telugu Report· Hyderabad
సోషల్ మీడియా పోస్టులపై కేంద్రం నిఘా

మావోయిస్టురహిత దేశం ఏర్పడిందని ప్రకటించిన కేంద్రం ఇప్పుడు వారి సానుభూతిపరులపై దృష్టి సారించింది. మావోయిస్టులకి అనుకూలంగా సోషల్ మీడియా పోస్టులపై నిఘా ఉంచింది. తెలంగాణలో ప్రజాసమస్యలపై స్పందించే కవులు , కళాకారులు, మేధావులు మొత్తం 200 మందిపై అర్భన్ నక్సల్స్ ముద్ర వేసి వారి కదలికలను గమనిస్తోంది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు వికల్స్ అంత్యక్రియలకు హాజరై మాట్లాడిన వారందరికీ నోటీసులు వెళ్లాయి. కవి నందిని సిద్ధారెడ్డి, పౌరహక్కుల నేత గడ్డం లక్ష్మణ్ లను పలు మార్లు విచారించారు. ఇదే కేసులో ఇప్పటికే గాదె ఇన్నయ్య జైల్లో ఉన్నారు. మావోయిస్టుల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారినే కాకుండా వాటికి లైక్ లు, కామెంట్లు పెట్టేవారిపై కూడా కేంద్రం నిఘా పెంచింది.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 1d ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.