← Back to news

వింటర్ వైబ్స్ కోసం పాడేరు రెడీ!

By Nani Eluri· 3 Oct 2026· Just telugu

ఎండలు మండిపోతున్నాయ్.. కానీ అక్కడ మాత్రం వింటర్ వైబ్స్! తెలుగు రాష్ట్రాల్లో వేడి పెరుగుతున్నా, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో దట్టమైన పొగమంచు, చల్లటి గాలులు, సన్నని జల్లులు కనిపిస్తున్నాయి. గత మూడు రోజులుగా టెంపరేచర్లు తగ్గడంతో ఉదయాన్నే పొగమంచు కమ్ముకుంటోంది. ఈ కూల్ వెదర్‌ను ఎంజాయ్ చేసేందుకు టూరిస్టులు కూడా పాడేరు బాట పడుతున్నారు. వీకెండ్‌లో కాస్త చిల్ అవ్వాలంటే పాడేరుకు ఓ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు!

More in Lifestyle