రికార్డుల్లోకి శ్రీశైలం డ్యామ్

శ్రీశైలం డ్యాంకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దేశంలోనే World Book of Records(లండన్)లో స్థానం దక్కించుకున్న తొలి ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. 60 అడుగుల వెడల్పు, 55 అడుగుల ఎత్తున్న క్రస్ట్ గేట్లు, భారీ వరదలను తట్టుకునే సామర్థ్యాన్ని పరిశీలించిన నిపుణుల బృందం ఈ గుర్తింపుకు రికమెండ్ చేసింది. ఈరోజు శ్రీశైలంలో జరిగే కార్యక్రమంలో సంస్థ సౌత్ రీజియన్ జాయింట్ సెక్రటరీ ఇలియాజర్, MLA బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, ఇరిగేషన్ CE కబీర్ బాషా, డ్యాం SE వేణుగోపాల్‌కు సర్టిఫికెట్ అందజేయనున్నారు.


