రూ.46 లక్షల ప్యాకేజీ వదిలి.. Armyలోకి ఎంట్రీ!

Amazonలో క్లౌడ్ ఇంజినీర్‌గా ఏడాదికి రూ.46 లక్షల సాలరీ, Airbus నుంచి మరో భారీ జాబ్ ఆఫర్ ఉన్నా.. లక్నోకు చెందిన శార్దెందు తివారీ కార్పొరేట్ లైఫ్‌ను పక్కన పెట్టి దేశ సేవను ఎంచుకున్నారు. ఆర్మీ సెలక్షన్‌లో 8 సార్లు ఫెయిల్ అయినా పట్టువదలకుండా 9వ ప్రయత్నంలో టెక్నికల్ ఎంట్రీ ద్వారా ఆర్మీలోకి సెలెక్ట్ అయ్యారు. గయా OTAలో ‘సీనియర్ అండర్ ఆఫీసర్’గా బాధ్యతలు కూడా చేపట్టారు. ఆయన జర్నీ యువతకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది.



