బాన్సువాడలో రెండ్రోజుల స్పెషల్ ట్రైనింగ్

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని SRNK గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో సెప్టెంబర్ 29, 30 తేదీల్లో విలేకరులకు రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో వార్తల సేకరణ, ఫ్యాక్ట్-చెకింగ్, సమాచార హక్కు చట్టం (RTI), మీడియా చట్టాలు, విలువలతో కూడిన జర్నలిజంపై నిపుణులు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గెస్టుగా వస్తున్నారు.



