ధాబాలో లూజ్ పనీర్.. రిజిస్ట్రేషన్ సస్పెన్షన్?
TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌లోని తాజ్ ఫ్యామిలీ ధాబాలో తెలంగాణ స్టేట్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్షన్ చేసింది. ఈ చెకింగ్స్‌లో కొన్ని రూల్స్ బ్రేక్ చేసినట్లు గుర్తించారు. ధాబాలో ఉన్న లూజ్ పనీర్ శాంపిల్‌ను కలెక్ట్ చేసి ల్యాబ్ టెస్టింగ్‌కు పంపించారు. వయొలేషన్స్ ఆధారంగా ధాబా ఫుడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను సస్పెండ్ చేయాలని అధికారులు రికమెండ్ చేశారు. పనీర్ ల్యాబ్ రిపోర్ట్, చెకింగ్ రిజల్ట్స్ ఆధారంగా నెక్ట్స్ యాక్షన్ తీసుకోనున్నారు.


