డేటా సెంటర్లతో పెరిగే ఖర్చెంత?

TG: హైదరాబాద్‌లో డేటా సెంటర్లు వేగంగా పెరుగుతున్నాయి. అయితే వీటి వల్ల ప్రజలు, ప్రభుత్వంపై పడే ఖర్చును కూడా లెక్కించాలని మాజీ కేంద్ర కార్యదర్శి E.A.S. Sarma కోరుతున్నారు. డేటా సెంటర్లకు భారీగా కరెంట్, నీరు అవసరమవుతాయని ఆయన చెబుతున్నారు. వీటి వల్ల భూమి, పర్యావరణంపై కూడా ప్రభావం పడొచ్చని అంటున్నారు. తెలంగాణలో 5000 మెగావాట్ల డేటా సెంటర్లు వస్తే కరెంట్, నీటి అవసరాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. వీటి వల్ల వచ్చే లాభాలతో పాటు అసలు ఖర్చును CAG లెక్కించాలని కోరుతున్నారు.

