← Back to news

మత్తు ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ మృతి

By DK· 24 Jun 2026· Eenadu· హైదరాబాద్‌
మత్తు ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ మృతి

TG: APలోని విశాఖపట్నానికి చెందిన మొహ్మద్ ఇమాయతుల్లా, అతని కుమారుడు ఖాసిం (27) HYD పాతబస్తీలోని యాకుత్‌పురాలో నివాసముంటున్నారు. డాక్టర్ ఖాసీం మల్లాపూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీ చేస్తున్నాడు. రాత్రి విశ్రాంతికని ఆసుపత్రిలోని తన గదిలోకెళ్లి గడియపెట్టుకున్నాడు. ఖాసీం ఎంతసేపటికీ బయటకు రావడం లేదని ఆసుపత్రి సిబ్బంది తలుపులు విరగ్గొట్టారు. అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. తనకు నిద్ర పట్టడం లేదని ఖాసిం చెప్పేవారని ఆయన తండ్రి పోలీసులకు తెలిపారు. నిద్ర కోసం మాత్రలతోపాటు మత్తు ఇంజెక్షన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

More in Crime

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్
Crime· 21h ago

డిజిటల్ అరెస్ట్ స్కామ్.. 89 చోట్ల CBI రైడ్స్

‘డిజిటల్ అరెస్ట్’ స్కామ్‌లపై CBI బిగ్ యాక్షన్ తీసుకుంది. <a href="https://www.indiatoday.in/india/story/digital-arrest-cases-cbi-raids-89-locations-across-20-states-arrests-three-2987012-2026-09-04">ఆపరేషన్ చక్ర-VIలో</a> భాగంగా 20 రాష్ట్రాల్లోని 89 ఏరియాల్లో రైడ్స్ చేసింది. ఈ కేసుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసింది. మూడు కేసుల్లో బాధితుల నుంచి ఏకంగా రూ.42.36 కోట్లు కొట్టేసినట్లు CBI తెలిపింది. నిందితులు పోలీసులుగా నటించి బాధితులను నెలల పాటు ‘డిజిటల్ అరెస్ట్’లో ఉంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నట్లు తెలిపింది. రైడ్స్‌లో బ్యాంక్ డాక్యుమెంట్స్, డిజిటల్ డివైసెస్ స్వాధీనం చేసుకుంది. సుప్రీంకోర్టు ఆర్డర్స్‌తో CBI ఈ రీసెంట్ రైడ్స్ చేసింది.