← Back to news

నెట్‌వర్క్ లేని ప్రాంతాలను గుర్తించాలి: కలెక్టర్

By BDev Poddu· 5h ago· Sarabhaguda, Araku Valley, Alluri Sitharama Raju
నెట్‌వర్క్ లేని ప్రాంతాలను గుర్తించాలి: కలెక్టర్

మారుమూల ఆదివాసీ ప్రాంతాల్లో నెట్‌వర్క్, రహదారి సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ నిశాంతి అధికారులను ఆదేశించారు. నెట్‌వర్క్ లేని ప్రాంతాలను బ్లాక్‌స్పాట్లుగా గుర్తించి జాబితా సిద్ధం చేయాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో బీఎస్‌ఎన్‌ఎల్ సేవల ఏర్పాటుకు సాంకేతిక అవకాశాలను పరిశీలించాలని తెలిపారు. రహదారులు లేని గ్రామాలు, పెండింగ్ రోడ్ల వివరాలు సేకరించి పనులను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

More in Local