← Back to news

మేకలను ఎత్తుకెళ్లిన దుండగులు?

By K. PURNA CHANDU.· 5h ago· Palasa, Palasa, Srikakulam
మేకలను ఎత్తుకెళ్లిన దుండగులు?

శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలాజీపురంలో మేకల మందలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన తలగాన బాలరాజుకు చెందిన 28 మేకలను ఇవాళ తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. సొండిపూడి, కొత్తపల్లి రహదారి సమీపంలో ఫెన్సింగ్, తాళం వేసి ఉన్న మందలోకి ప్రవేశించి మేకలను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. వాహనంలో వచ్చి చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు. బాలరాజు ఫిర్యాదుతో పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

More in Local