సైబర్ మోసాలపై అవగాహన.. 1930కు కాల్ చేయండి!

హైదరాబాద్ జిల్లాలో నాచారం పోలీసులు హబ్సిగూడలోని ఒమేగా డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, జాబ్ మోసాలపై అధికారులు వివరించారు. మోసపోతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని సూచించారు.



