‘జైలర్ 2’ చూసేందుకు ఇక ఎక్కువ ఖర్చే!

AP: రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ టికెట్ రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అక్టోబర్ 15 నుంచి 21 వరకు సింగిల్ స్క్రీన్లలో టికెట్‌పై 50 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 75 రూపాయలు అదనంగా వసూలు చేయొచ్చు. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 15న థియేటర్లలోకి రానుంది. అనిరుధ్ ఈ మూవీకి మ్యూజిక్ అందించారు. టికెట్ రేట్లు పెరగడంతో మొదటి వారం సినిమా చూసేవాళ్లు ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.



