తమ భూముల కోసం రైతుల నిరసన

AP: విజయనగరం జిల్లా భోగాపురంలో రిలయన్స్ డేటా సెంటర్ కోసం భూములు సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు నిరసన చేపట్టారు. ప్రాజెక్ట్ కోసం సుమారు 850 ఎకరాలు అవసరం కాగా, ప్రభుత్వం వద్ద ప్రస్తుతం 50 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. మరో 800 ఎకరాలు సేకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. భూములు కోల్పోతామనే ఆందోళనతో రైతులు అధికారుల సమావేశానికి కూడా వెళ్లలేదు. కొందరు రైతులు ఇప్పటికే ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. భూములు పోతే జీవనాధారం దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు



