అసెంబ్లీలో బూతులు, గొడవలా- లెఫ్ట్ నేతలు ఫైర్

అసెంబ్లీ గేటు దగ్గర BRS మహిళా MLAలతో పోలీసులు నడుచుకున్న తీరును, అదే టైమ్‌లో స్పీకర్‌పై MLC తాతా మధు చేసిన కామెంట్స్‌ను CPI(M) తీవ్రంగా ఖండించింది. ప్రజా సమస్యలను పక్కనపెట్టి బూతులు, గొడవలతో అసెంబ్లీ టైమ్ వేస్ట్ చేస్తున్న కాంగ్రెస్, BRS లీడర్స్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఫీజులు, జాబ్స్, రేషన్ కార్డ్స్, పెన్షన్ల హామీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని CPI(M) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలపై చర్చించకపోతే ప్రజలే బుద్ధి చెప్తారని హెచ్చరించారు.



