ఢిల్లీ ఘటనపై హైదరాబాద్‌లో నిరసన

TG: మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల దాడి, అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తూ తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) నిరసనకు పిలుపునిచ్చింది. 4pm Digital News మహిళా జర్నలిస్టులు షాహీన్ ఖాన్, నఫీసా ఖాన్‌పై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని TUWJ డిమాండ్ చేసింది. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలన్నారు. మంగళవారం హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్ నుంచి జగ్జీవన్ రామ్ విగ్రహం వరకు క్యాండిల్ ప్రదర్శన నిర్వహించారు.



