← Back to news

జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ క్యాండిల్ ప్రదర్శన

By DK· 57m ago

TG: మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల దాడి, అరెస్టును ఖండిస్తూ TUWJ, అనుబంధ మహిళా జర్నలిస్టుల విభాగం నిరసన చేపట్టాయి. 4pm Digital News మహిళా జర్నలిస్టులు షాహీన్ ఖాన్, నఫీసా ఖాన్‌పై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ CM రేఖాగుప్తా జర్నలిస్టులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన క్యాండిల్ ప్రదర్శనలో TUWJ, మహిళా జర్నలిస్టులు, సోషల్ యాక్టివిస్టులు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొని బాధిత జర్నలిస్టులకు మద్దతు తెలిపారు.

More in TG