ఇకపై కోర్టు విచారణల వీడియోలు వాడలేం!

సోషల్ మీడియాలో కోర్టు విచారణల వీడియోలు వాడటంపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. పర్మిషన్ లేకుండా సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కోర్టు వీడియోలు, ఆడియోలు పోస్ట్ చేయడాన్ని నిషేధించింది. వీడియోలను ఎడిట్ చేయడం, మానిటైజ్ చేయడం, డౌన్‌లోడ్ లేదా రీ-పోస్ట్ చేయడం నేరమని తెలిపింది. కోర్టు రికార్డింగ్‌లను అనుమతి లేకుండా దాచడం, ప్రసారం చేయడాన్ని కూడా నిలిపివేసింది. అయితే మీడియా సంస్థలకు మినహాయింపు ఇచ్చింది.


