అరవింద్ కేజ్రీవాల్.. దీనికి మీ ఆన్సర్ ఏంటి?: కాంగ్రెస్
పంజాబ్‌ను డ్రగ్స్ లేని రాష్ట్రంగా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారని, కానీ పంజాబ్‌లో పరిస్థితి పూర్తిగా విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. కేజ్రీవాల్ గ్రూప్ పంజాబ్‌లో డ్రగ్స్ నెట్‌వర్క్ నడుపుతూ డబ్బు సంపాదిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని తన అఫీషియల్ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. బఠిండా ధాన్యం మార్కెట్‌లో ఒక యువతి బాధాకరమైన పరిస్థితిలో ఉన్న వీడియో పోస్ట్ చేసి, కేజ్రీవాల్, ఆప్ పార్టీ పంజాబ్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసింది.