మంగళగిరి YCP సమన్వయకర్తగా సోమిరెడ్డి!

గుంటూరు జిల్లా మంగళగిరిలో YCP కీలక నియామకం జరిగింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.ఈ మేరకు హెడ్డాఫీసుకు వెళ్లి ముఖ్య నాయకత్వాన్ని కలిసి ధన్యవాదాలు చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి మహమ్మద్ గోరేబాబు, కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కళ్లం రాజశేఖర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్‌రాజు పాల్గొన్నారు.


