రన్నింగ్‌లో ఇండియాకి మరో మెడల్

ఆసియా గేమ్స్‌లో మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కి బ్రాంజ్ మెడల్ దక్కింది. భారత అథ్లెట్ హరిత భద్ర 23.20 సెకన్లలో రేసును కంప్లీట్ చేసి థర్డ్ ప్లేస్‌లో నిలిచింది. దీంతో ఆమె బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో పోటీ చేసిన మరో భారత అథ్లెట్ ఉన్నతి.. 23.46 సెకన్లలో రేసు ముగించి ఆరో స్థానంలో నిలిచింది. సింగపూర్‌కి చెందిన శాంతి పెరీరా గోల్డ్, చైనాకి చెందిన చెన్ యుజీ సిల్వర్ గెలుచుకున్నారు.



