← Back to news

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము

By Mahesh· 1h ago· విజయవాడ
కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము

AP: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయగా, అర్చకులు వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు పట్టువస్త్రాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. క్యూలైన్లలో ఉన్న భక్తులకు రాష్ట్రపతి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అంతకుముందు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ముర్ముకు గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు చేరుకున్నారు.

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము

More in AP