ఆశ్రమంలో గంజాయి సాగు: దొంగ స్వామీజీ గుట్టురట్టు!

వికారాబాద్ జిల్లా యాలాల పరిధిలో దొంగ స్వామీజీ గుట్టురట్టయింది. గోవిందరావుపేట శివారులోని ఒక ఆశ్రమంపై పోలీసులు సడన్‌గా రైడ్స్ చేశారు. స్పిరిచువల్ సెంటర్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న 25 గంజాయి మొక్కలను, భారీగా ఎండు గంజాయిని అధికారులు సీజ్ చేశారు. ఎక్సైజ్, రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు సాక్ష్యాలను రికార్డు చేసి కేసు నమోదు చేశారు. భక్తి పేరుతో మోసం చేసిన ఈ స్వామీజీ అసలు రంగు బయటపడటంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. అతని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.



