ఆరుట్లలో ప్రభుత్వ బడికి కొత్త రూపు.. ఇది కదా కావాల్సింది!
TG: రంగారెడ్డి జిల్లా, మంచాల మండలం, ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్.. ప్రభుత్వ విద్యలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ ప్రీ-ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకూ.. ఒకే క్యాంపస్‌లో ఇంగ్లీష్ మీడియం విద్య అందుతోంది. డిజిటల్ క్లాస్‌రూమ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, డైనింగ్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్‌తో పాటూ.. విద్యార్థులకు రవాణా సౌకర్యం కూడా ఉంది. ఇక్కడ దాదాపు 1,800 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇలాంటి స్కూల్స్ మరిన్ని రావాలనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే <a href="https://www.theclearcutnews.com/n/9RMisjV">TPF విద్యా బస్సుయాత్ర</a> కొనసాగుతోంది.



