ఆకట్టుకుంటున్న మంచు అందాలు.. వైరల్ అవుతున్న దృశ్యాలు
జమ్మూ కశ్మీర్లోని గుల్మార్గ్లో మంచు అందాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. అఫర్వాట్ శిఖరంపై తొలిసారి మంచు కురవడంతో పర్యాటకులు సందడి చేస్తున్నారు. మంచుతో గుల్మార్గ్ ప్రాంతం తెల్లని అందాలతో కనువిందు చేస్తుండడంతో పర్యాటకులు ఆనందంగా గడుపుతున్నారు. ఫారిన్ నుంచి వచ్చిన పర్యాటకులను గుల్మార్గ్లో మంచును చూడటం ఎంతో అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఈ ప్రాంతాన్ని సందర్శించాలని ఇతరులకు కూడాసూచించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.

